పంద్రాగస్టు లోపు ప్రతీ రైతుకు రూ.2లక్షల వరకు రుణమాఫీ చేస్తామని కీలక వ్యాఖ్యలు చేశారు. ఆగస్టు 15లోపు రైతులకు రుణమాఫీ చేస్తానని మరోసారి ఉద్ఘాటించారు. వచ్చే సీజన్ లో రూ.500 బోనస్ ఇచ్చి వరి కొనుగోలు చేస్తానని తెలిపారు. ప్రధానంగా మెదక్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలం మధుకి మద్దతుగా నిర్వహించిన ర్యాలీలో ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
కాంగ్రెస్ ను ఓడించేందుకు మోడీ, కేసీఆర్ కి కలిసి కుట్ర చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. మెదక్ ప్రాంతంలో ఇందిరాగాంధీ తెచ్చిన పరిశ్రమలే ఇంకా ఉన్నాయని.. బీఆర్ఎస్, బీజేపీలు ఏమీ చేయలేదని దుయ్యబట్టారు. అధికారంలోకి వచ్చాక 100 రోజుల్లో ఐదు గ్యారెంటీలను అమలు చేశామని తెలిపారు. కాంగ్రెస్ ను ఓడించేందుకు నరేంద్ర మోడీ, కేసీఆర్ కలిసి కుట్ర చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. మెదక్ ప్రాంతంలో ఇందిరాగాంధీ తెచ్చిన పరిశ్రమలే ఇంకా ఉన్నాయని.. బీఆర్ఎస్, బీజేపీలు ఏమి చేయలేదని దుయ్యబట్టారు.