ఉద్దానం కిడ్నీ బాధితులకు సీఎం జగన్ భరోసా…

-

మాట ఇస్తే తప్పుడు అనేది ఏపీ సీఎం జగన్ నైజం. దీనిని ఆయన ఎప్పటికప్పుడు నిరూపిస్తున్నారు కూడా.ఇప్పటికే ఉద్ధానం బాధితుల కోసం ప్రత్యేక ఆస్పత్రి మరియు రీసెర్చ్ సెంటర్ ను ఏర్పాటు చేశారు. అంతటితో చేతులు దులిపేసుకోలేదు ఆయన.వారి సంక్షేమం కోసం అవసరమైన చర్యలను తీసుకుంటున్నారు.ఇదిలా ఉండగా మేమంతా సిద్ధం బస్సుయాత్రలో ఉద్దానం కిడ్నీ బాధిత కుటుంబం సీఎం జగన్‌ను కలిశారు. కిడ్నీ బాధిత కుటుంబంతో ప్రత్యేకంగా మాట్లాడిన సీఎం జగన్‌.. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా.. కిడ్నీ బాధిత కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.

బస్ యాత్రలో సీఎం జగన్‌ను కలవడం సంతోషంగా ఉందన్నారు ఉద్దానం కిడ్నీ బాధితులు.. కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్‌ బాధితులను ఆదుకోవాలని కోరగా కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్‌ బాధితులకు మందుల కోసం నెలకు 12వేలు ఖర్చు అవుతుదని సీఎం జగన్‌కు చెప్పినట్లు తెలిపారు. ఇప్పుడు ఇస్తున్న 5వేల పెన్షన్‌తోపాటు.. కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్‌ బాధితులకు మందులు కూడా ఉచితంగా ఇస్తామని సీఎం జగన్‌ హామీ ఇచ్చారని కిడ్నీ బాధిత కుటుంబం తెలిపింది. కిడ్నీ బాధితులను గతంలో వైయస్సార్‌.. ఇప్పుడు సీఎం జగన్‌ ఆదుకుంటున్నారని కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్‌ బాధితుడు తెలిపాడు. జగన్‌ అధికారంలోకి వచ్చాకే కిడ్నీ బాధితులకు రూ.5వేలు పెన్షన్‌ ఇస్తున్నారని.. మళ్లీ అధికారంలోకి వచ్చాక ఆరోగ్యశ్రీలోనే మందులు కూడా ఫ్రీగా ఇస్తామని తెలిపారన్నారు.దీంతో కిడ్నీ బాధితుల్లో హర్షం వ్యక్తమవుతోంది.

తాజాగా సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర.. విజయనగరం జిల్లాలోకి ప్రవేశించింది. నెల్లిమర్ల నియోజకవర్గంలో సీఎం జగన్‌ బస్సు యాత్ర కొనసాగుతోంది. జిల్లా ఎంట్రన్స్‌లో సీఎం జగన్‌ -బస్సుయాత్రకు ఘనస్వాగతం పలికారు వైఎస్సార్‌సీపీ నేతలు.. ఏపీ సీఎం చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్రకు వైసీపీ శ్రేణులు, అభిమానులు విశేష ఆదరణ చూపిస్తున్నారు.ఇప్పటి వరకు బస్సు యాత్ర 2 వేల కిలోమీటర్ల మేర కొనసాగింది. ప్రజల్లో జగన్ గ్రాఫ్ ఎంత పెరిగిందో బస్సు యాత్ర ద్వారా అర్థమవుతోందని, జగన్ బస్సు యాత్ర దేశంలోనే ఒక చరిత్ర వైసీపీ శ్రేణులు అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news