బీఆర్ఎస్ హయాంలో 24 గంటలు వచ్చిన కరెంట్ ఇప్పుడు ఎందుకు రావడం లేదు : కేసిఆర్

-

రైతుబంధు అడిగితే చెప్పుతో కొడతామని ఓ మంత్రి అంటున్నారని.. రైతుల చెప్పులు ఇంకా గట్టిగా ఉంటాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.సక్కగున్న తెలంగాణలో ఉడుముల్లా సొచ్చి అవస్థలు తెస్తున్నరు అని కాంగ్రెస్ ప్రభుత్వం‌పై నిప్పులు చెరిగారు.

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ మిర్యాలగూడ రోడ్ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ హయాంలో 24 గంటలు వచ్చిన కరెంట్ ఇప్పుడు ఎందుకు రావడం లేదని కేసిఆర్ ప్రశ్నించారు. బీఆర్ఎస్ హయాంలో మిగులు విద్యుత్ ఉండేలా చేశామన్నారు. కాంగ్రెస్ హయాంలో రైతుబంధులో దగా.. రైతుబీమా ఉంటుందో.. ఊడుతుందో తెలియదన్నారు. లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులు గెలిస్తే ప్రభుత్వం మెడలు వచ్చి 420 హామీలను అమలు చేయించేలా పోరాటం చేస్తామన్నారు. నల్గొండ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డికి ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు కేసీఆర్.

Read more RELATED
Recommended to you

Latest news