జగన్ అహంకారి, విధ్వంసకారుడు..వైసీపీకి డిపాజిట్లు కూడా రావు: చంద్రబాబు

-

ఎన్డీఏ సభలకు వస్తున్న ఆదరణ చూసి వైసీపీలో గుబులు మొదలైందని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు అన్నారు. ‘ప్రజలందరినీ జగన్ తన బానిసలుగా చూస్తున్నారు. జగన్ అహంకారి, విధ్వంసకారుడు అని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఎన్నికలప్పుడు ఏదో ఒక నాటకం ఆడటం జగన్కు అలవాటు. ఇప్పడు గులకరాయి డ్రామా ఆడుతున్నారు అని మండిపడ్డారు. ఈ ఎన్నికల్లో వైసీపీకి డిపాజిట్లు కూడా రావు. ప్రజల కలలు చెరిపేసిన దుర్మార్గుడు జగన్’ అని ఆయన విరుచుకుపడ్డారు.

టీడీపీ మహిళలకు పుట్టినిల్లు అని, తాను మొదటి నుంచి మహిళా పక్షపాతిని అని చంద్రబాబు అన్నారు. వైసీపీ పాలనలో ప్రజలు ఇబ్బంది పడ్డారు.నిత్యావసరాలు సహా అన్నింటి ధరలు పెంచేశారు. ఆడబిడ్డలను లక్షాధికారులను చేయడమే నా లక్ష్యం అని తెలిపారు. స్థలం లేని వారికి 2, 3 సెంట్లు ఇప్పించి ఇళ్లు కట్టిస్తాం.మేం వచ్చాక రూ.4వేలు పెన్షన్ ఇస్తాం అని హామీ ఇచ్చారు. వైసీపీని బంగాళాఖాతంలో కలిపేయాలి. మే 13న దిమ్మ తిరిగే తీర్పు ఇవ్వాలి’ అని పిలుపునిచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news