ముంబై కెప్టెన్ హర్డిక్ పాండ్యకి సెహ్వాగ్ కీలక సూచనలు

-

ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ముంబై కెప్టెన్గా, ప్లేయర్ గా అంతగా రాణించలేకపోతున్న హార్దిక్ పాండ్యకు మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ కీలక సూచనలు చేశారు. గత రెండు సీజన్ల నుంచి ముంబై ప్రదర్శన ఇలానే ఉందన్నారు. జట్టుగా ఆడితేనే ముంబైకి విజయాలు దక్కుతాయన్నారు. పాండ్య తన వ్యక్తిగత ప్రదర్శనను మెరుగుపర్చుకోవాలని సెహ్వాగ్ సూచించారు. బ్యాటింగ్ ఆర్డర్లో మార్పులు చేసుకొని ముందుగా బ్యాటింగ్కు రావాలని సూచించారు.

కాగా ,ట్రేడింగ్ ఆప్షన్ ద్వారా గుజరాత్ టైటాన్స్ నుండి హార్థిక్ పాండ్యని ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. అయితే హర్డిక్ పాండ్య ముంబై కెప్టెన్ గా పగ్గాలు చేపట్టిన సంధి సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కెప్టెన్సీ లోను హర్డిక్ పాండ్య విఫలం చెందుతున్నాడు. ఇక ఇటు బ్యాటింగ్ పరంగా బౌలింగ్ పరంగా కూడా దారుణంగా నిరాశ పరుస్తున్నాడు. కాగా, ముంబై ఇండియన్స్ ఇప్పటివరకు ఆడిన మ్యాచ్లలో కేవలం మూడింట మాత్రమే గెలిచింది.

Read more RELATED
Recommended to you

Latest news