జయం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయిన హీరో నితిన్. కెరీర్ ఆరంభంలోనే భారీ విజయాలు సాధించాడు. ఆ తర్వాత కొన్నేళ్ల పాటు జోరు ప్రదర్శించినా ఆ తర్వాత వరుస వైఫల్యాలను చవి చూశాడు. ఇక, ఇష్క్ తర్వాత సినిమా తర్వాత మళ్లీ సక్సెస్ పట్టాలెక్కాడు. ఇక ఇదిలా ఉంటే హ్యాండ్ సమ్ అండ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ నితిన్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాడట. ఈయన కొన్ని రోజులుగా ఓ అమ్మాయితో ప్రేమలో ఉన్నాడని తెలుస్తోంది. వీరి ప్రేమకు ఇరు కుటుంబాలు అంగీకరించాయని… పెళ్లికి సిద్ధమవుతున్నాయని అంటున్నారు. మరియు వధువు కూడా అచ్చ తెలుగుమ్మాయనే వార్తలైతే వినిపిస్తున్నాయి.
ఇక అన్నీ కుదిరితే వచ్చే ఏడాది ఏప్రిల్ లో విదేశాల్లో వీరి వివాహం జరగనున్నట్టు సమాచారం. దుబాయ్ లోనే ఈ పెళ్లి జరగవచ్చని విశ్వసనీయంగా తెలుస్తోంది. ఈ పెళ్లికి కుటుంబసభ్యులు, కొందరు సన్నిహితులు మాత్రమే హాజరవుతారని సమాచారం. అయితే ఈ పెళ్లి వార్తలపై నితిన్ ఇంకా స్పందించాల్సి ఉంది. కాగా, నితిన్ ప్రస్తుతం వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న భీష్మలో నటిస్తున్నారు. ఈ సినిమాకు సంబందించి ఇటీవలే ఓ రొమాంటిక్ టీజర్ విడుదలై విశేషంగా ఆకట్టుకుంది. నితిన్ మరో సినిమా రంగ్ దే. ఈ సినిమాకు వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్నాడు. కీర్తి సురేష్ హీరోయిన్గా చేస్తోంది.