గాడిదను చూస్తేనే గుర్రం విలువ తెలుస్తది.. చీకటి ఉంటే వెలుగు విలువ తెలుస్తది : కేటీఆర్

-

కరీంనగర్ లోక్‌సభ పరిధిలోని కోనరావుపేటలో జరిగిన రోడ్ షోలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ…10 నుంచి 12 సీట్లు మాకు అప్పగించండి. ఏడాది లోపు మళ్లీ కేసీఆర్ రాష్ట్ర రాజకీయాలను శాసిస్తారు అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక్కోసారి ఓడిపోవటం కూడా మంచిదే .గాడిదను చూస్తేనే గుర్రం విలువ తెలుస్తది.. చీకటి ఉంటే వెలుగు విలువ తెలుస్తది అని అన్నారు.

అందుకే మీ తరుపున బ్రహ్మండంగా కొట్లాడే నాయకుడు వినోద్ గారిని గెలిపించండి అని కోరారు.సిరిసిల్లలో ఇద్దరు నేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారు.ఒకనాడు సిరిసిల్లను ఉరిసిల్ల చేసిన కాంగ్రెస్ మళ్లీ అదే పని చేస్తోంది అని మండిపడ్డారు.కాంగ్రెస్ రాగానే రైతులు, నేతన్న ఆత్మహత్యలు, కరెంట్ పోవుడు, మోటార్లు కాలుడు మళ్లీ స్టార్ట్ అయినయ్.కాంగ్రెస్ నేతలు ఇచ్చిన హామీలు నెరవేరాలంటే వాళ్ల పేయిల భయం ఉండాలంటే బీఆర్ఎస్ గెలవాలె.ఒక్కసారి మోసం పోతే మోసం చేసిన వాడి తప్పు..రెండోసారి మోసం చేస్తే మన తప్పే అవుతది.వాడు తులం బంగారం కాదు కదా? తులం ఇనుము కూడా ఇయ్యడు.రైతులకు బోనస్ అన్నాడు.. అది బోగస్ ముచ్చట అని మండిపడ్డారు.

 

Read more RELATED
Recommended to you

Latest news