నడిచి వెళ్ళేవాళ్ళను టార్గెట్ చేస్తున్న మొబైల్ స్నాచింగ్ ముఠా..!

-

అంతర్జాతీయ మొబైల్స్ స్నాచింగ్ ముఠాకి చెందిన వాళ్ళని సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. ఇక వివరాలుకు వెళితే ముఠాకి చెందిన ఐదుగురు సూడాన్ దేశస్థులతో పాటుగా 17 మందిని అదుపులోకి తీసుకున్నారని తెలుస్తోంది. వాళ్ళ నుంచి రూ.1.75 కోట్ల విలువైన 7.03 సెల్ఫోన్లని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. నిందితుడుని హైదరాబాద్ సిటీ కొత్తపేట శ్రీనివాస్ రెడ్డి మీడియా ముందు కి ప్రవేశపెట్టారు.

ఈ సందర్భంగా సిపి మాట్లాడారు నిందితుల్లో 12 మంది హైదరాబాద్కు చెందిన వాళ్ళని ఇంకో ఐదుగురు సూడాన్ వాసులని చెప్పారు. రాత్రి సమయంలో నడుచుకుంటూ వెళ్తున్న వాళ్ళని టార్గెట్ చేస్తూ మొబైల్స్ మ్యాచింగ్ ముఠా మొబైల్స్ ని దోచుకుంటుందని చెప్పారు కొన్ని సందర్భాల్లో వాళ్లని మాటల్లో పెట్టే మొబైల్స్ ని చోరీ చేస్తున్నట్లు చెప్పారు రాత్రి 10:00 తర్వాత స్నాచింగ్ ఎక్కువగా జరుగుతున్నట్లు గుర్తించామన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news