తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. టోకెన్లు లేని భక్తుల శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. 31 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న 57 వేల 909 మంది స్వామివారిని దర్శించుకున్నారు. హుండీకి రూ.3.81 కోట్ల ఆదాయం సమకూరింది. తిరుమల శ్రీవారి సేవలో పాలుపంచుకునే అవకాశం కల్పిస్తోంది టీటీడీ.. శ్రీవారి సేవలో భాగంగా టీటీడీకి చెందిన అన్ని విభాగాల్లోనూ భక్తులు పాలుపంచుకుంటారు.
స్వామివారి సేవ కోసంవచ్చిన వారికి భోజనం, బసతోపాటు చివరి రోజు స్వామి దర్శనభాగ్యం కల్పిస్తోంది టీటీడీ. 2000లో శ్రీవారి సేవ వ్యవస్థను తీసుకొచ్చింది టీటీడీ. తిరుమలకు వచ్చే భక్తుల రద్దీని నియంత్రించడం, ఇతర సేవల్లో పాల్గొనడానికి ఆసక్తి చూపే వారి కోసం శ్రీవారి సేవకులు పేరుతో ప్రత్యేకంగా ఓ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చింది. టీటీడీ వెబ్‌సైట్, యాప్ ద్వారా భక్తులు తమ పేరు, ఇతర వివరాలను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.