కాంగ్రెస్ కు మరో షాక్.. దిల్లీ పీసీసీ అధ్యక్షుడు రాజీనామా

-

పార్లమెంట్ ఎన్నికల వేళ కాంగ్రెస్‌ పార్టీకి మరోసారి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. దిల్లీ కాంగ్రెస్‌ ఆధ్యక్షుడిగా ఉన్న అరవిందర్ సింగ్‌ లవ్లీ తన పదవికి రాజీనామా చేశారు. దిల్లీ కాంగ్రెస్‌ చీఫ్‌గా తాను కొనసాగలేనని పేర్కొంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు లేఖ రాశారు. గతేడాది ఆగస్టులో దిల్లీ కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన అరవిందర్‌ సింగ్‌ లవ్లీ ఏడాదికే తన పదవికి రాజీనామా చేయడం గమనార్హం.

అవినీతి ఆరోపణలతో పలువురు ఆప్ మంత్రులు జైలు పాలయ్యారని అయినా కాంగ్రెస్‌ పార్టీ లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీతో పొత్తు పెట్టుకుందని అందుకే రాజీనామా చేస్తున్నట్లు అరవిందర్ సింగ్ లవ్లీ తెలిపారు. దిల్లీ కాంగ్రెస్ కార్యకర్తల ప్రయోజనాలను రక్షించలేక పోతున్నానని లేఖలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే అధ్యక్షుడిగా కొనసాగేందుకు ఎలాంటి కారణం కనిపించడం లేదని లవ్లీ తెలిపారు. లవ్లీ రాజీనామాతో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలినట్లయింది. ఇప్పటికే పలువురు కీలక నేతలు పార్టీని వీడిన విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news