నేడు అమేఠి, రాయ్‌బరేలీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించనున్న కాంగ్రెస్‌

-

మరికొద్ది గంటల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ లోక్సభ ఎన్నికల పోటీపై క్లారిటీ రానుంది. కాంగ్రెస్‌ కంచుకోటగా భావిస్తున్న ఉత్తర్‌ప్రదేశ్‌లోని  అమేఠి, రాయ్‌బరేలి అభ్యర్థిత్వాలపై కొన్నిరోజుల నుంచి నెలకొన్న ఉత్కంఠకు ఇవాళ తెరపడనుంది. కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జునఖర్గే అమేఠి, రాయ్‌బరేలీలో పోటీ చేసే అభ్యర్థుల పేర్లను ఇవాళ ప్రకటించనున్నట్లు సమాచారం. ఆ రెండు స్థానాల్లో నామినేషన్ల దాఖలుకు రేపటితో గడువు ముగియనుండటంతో ఇవాళ కచ్చితంగా ప్రకటన వచ్చే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి.

అమేఠి, రాయ్‌బరేలీ నుంచి రాహుల్‌గాంధీ, ఆయన సోదరి ప్రియాంకా గాంధీ పోటీచేస్తారని తొలుత ప్రచారం జరిగింది. ఆ తర్వాత లోక్‌సభ ఎన్నికల్లో ప్రియాంక పోటీ చేయటం లేదనే వార్తలు ఇటీవల వచ్చాయి. 2004 నుంచి 2019 వరకు మూడుసార్లు అమేఠి నుంచి ఎంపీగా గెలుపొందిన రాహుల్‌.. 2019 ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి స్మృతి ఇరానీ చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత ఆయన కేరళలోని వయనాడ్‌ నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఈసారి కూడా అక్కడి నుంచే పోటీలో నిలిచారు. దీంతో అమేఠి, రాయ్‌బరేలీలో పోటీకి గాంధీ కుటుంబం వెనుకాడుతోందని బీజేపీ విమర్శలు గుప్పించింది.

Read more RELATED
Recommended to you

Latest news