కిమ్ సుఖం కోసం ఏటా 25 మంది అమ్మాయిలు

-

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఓ సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. ఆయన్ను ‘సంతోష పెట్టడానికి’ ఏటా 25 మంది అమ్మాయిల బృందం పనిచేస్తుందని సమాచారం. కిమ్‌ను ‘సంతోష పెట్టే’ (ప్లెజర్‌ స్క్వాడ్‌) బృందంగా పేర్కొనే ఈ పనికి గతంలో ఎంపికైన, ఉత్తర కొరియా నుంచి పారిపోయిన యేన్మి పార్క్‌ అనే యువతి చెప్పిన విషయాలను ‘మిర్రర్‌’ పత్రిక ఓ కథనంలో వెల్లడించింది.

ఈ కథనం ప్రకారం.. ‘యవ్వన దశలో ఉన్న అందమైన అమ్మాయిల కోసం కిమ్‌ ‘సన్నిహితులు’ ప్రతి ఏటా దేశమంతటా పర్యటించి కొందరిని ఎంచుకుని వారి కుటుంబ, రాజకీయ నేపథ్యం గురించి ఆరా తీస్తారు. అమ్మాయిలను సెలెక్ట్ చేసుకున్న తర్వాత వారికి కన్యత్వ పరీక్షలు నిర్వహించి చిన్న తేడా వచ్చినా అనర్హులుగా ప్రకటిస్తారు. ఎంపికైన వారిని రాజధాని ప్యాంగ్యాంగ్‌కు పంపించి.. వారిని మూడు బృందాలుగా విభజిస్తారు. మసాజ్ చేయడానికి ఒక బృందం; పాటలు పాడటం, నృత్యం చేయడానికి మరో బృందానికి శిక్షణ ఇస్తారు. మూడో గ్రూపును లైంగిక కార్యకలాపాల కోసం వినియోగిస్తారు. నియంతతో సన్నిహితంగా మెలగడమే వారి పని. ఆ యువతులంతా 20 నుంచి 30 ఏళ్ల లోపు వరకూ ఆ విధుల్లో ఉంటారు. అనంతరం వారిలో కొందరిని కిమ్‌ అంగరక్షకులకు ఇచ్చి వివాహాలు చేస్తారు.

Read more RELATED
Recommended to you

Latest news