కేసీఆర్ బాటలోనే రేవంత్‌రెడ్డి నడుస్తున్నారు : ఎంపీ లక్ష్మణ్ ఫైర్

-

తెలంగాణ లోక్సభ రాజకీయాల్లో రిజర్వేషన్ల అంశం ఇప్పుడు కీలకంగా మారింది. బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య రిజర్వేషన్ల అంశం చిచ్చుపెట్టింది. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు.. బీజేపీ గెలిస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తుందంటూ ప్రచారం చేస్తుండగా.. కమలదళం మాత్రం వారి వ్యాఖ్యలను కొట్టివేస్తూ అలాంటి నిర్ణయాలు తీసుకోనున్నట్లు తాము చెప్పలేదని తిప్పికొడుతున్నారు.

ఈ నేపథ్యంలో తాజాగా బీజేపీ ఎంపీ లక్ష్మణ్ మరోసారి రిజర్వేషన్ల అంశంపై మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీలను అవమానపరిచేలా నెహ్రూ 1961లో మాట్లాడారని.. ఆనాడు ముఖ్యమంత్రులకు ప్రధాని హోదాలో నెహ్రూ లేఖలు రాశారని పేర్కొన్నారు. కులాల ఆధారంగా రిజర్వేషన్లు ఇవ్వవద్దని రాజీవ్‌గాంధీ చెప్పారని గుర్తు చేశారు. పేదరికం ఆధారంగా రిజర్వేషన్లు ఇవ్వాలని రాజీవ్‌ గాంధీ చెప్పారని తెలిపారు. హిందువుల మనోభావాలను కాంగ్రెస్‌ నేతలు గాయపరుస్తున్నారని.. కేసీఆర్ బాటలోనే రేవంత్‌రెడ్డి నడుస్తున్నారని మండిపడ్డారు. వైఎస్ ఆనాడు బీసీల రిజర్వేషన్లు తగ్గించి ముస్లింలకు రిజర్వేషన్లు ఇచ్చారని.. మతపరమైన రిజర్వేషన్లు చెల్లవని సుప్రీంకోర్టు స్పష్టం చేసిందని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news