మాంసాహారం లేకుండా ఇల్లు గడిచే పరిస్థితే లేని జనం ఉన్నారు. దానికి బానిసలు గా మారి… ఆస్తులు అమ్ముకున్న వాళ్ళు కూడా ఉన్నారు. వారంలో రెండు మూడు రోజులు నీసు లేకుండా గడిచే పరిస్థితి లేదనేది వాస్తవం… ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో మాంసాహారానికి ఉన్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదనే సంగతి అందరికి తెలిసిందే. దానికి బానిసలుగా మారిపోయి… అనారోగ్యం బారిన పడిన వాళ్ళు కూడా ఉన్నారు. ఏ చిన్న కార్యక్రమం జరిగినా సరే ఇప్పుడు చికెన్ తప్పనిసరిగా మారిపోయింది.
అయితే ఇప్పుడు చికెన్ అంటే జనం భయపడుతున్నారనే వార్తలు వస్తున్నాయి. చాలా వరకు చికెన్ తినడానికి ఇష్టపడటం లేదని అంటున్నారు… దానికి కారణాలు ఒక్కసారి చూస్తే… బ్రాయిలర్ కోడి అనేది తక్కువ సమయంలో 40 రోజుల నుంచి 50 రోజుల్లో పెరుగుతూ ఉంటుంది. అయితే ఇప్పుడు మందుల కారణంగా 25 రోజుల తర్వాత దాన్ని మార్కెట్ లోకి తీసుకొస్తున్నారు. వేగంగా పెరగడానికి మందులు వేస్తున్నారు. దీనితో చికెన్ లో రుచి అనేది కనుమరుగు అయిపోయింది. చిన్న చిన్న కోళ్ళు మార్కెట్ లో అందుబాటులో ఉంటున్నాయి.
వీటి కారణంగా ఉబ్బసం, చిన్న వ్యాధులు వస్తున్నాయి అనే భయం జనాల్లో ఎక్కువగా ఉంది. ఇక చికెన్ కూడా బాగుండటం లేదనే భావన వారిలో కలిగింది. దీనితో నాటు కోడి మీద జనం ఎక్కువగా మొగ్గు చూపిస్తున్నారు అనే వ్యాఖ్యలు ఎక్కువగా వినపడుతున్నాయి. ఇక చిన్న పిల్లలకు పెట్టడానికి ఆసక్తి చూపించడం లేదు… నిల్వ ఉన్న చికెన్ కూడా మార్కెట్ లో పెరిగిపోయింది. దీనితో చికెన్ కి దూరంగా ఉండటమే ఉత్తమం అనే భావనకు జనాలు వచ్చేశారు. నాటు కోడి దొరికితే తినడం లేకపోతే చేప, మటన్ అంటూ దాని వైపే చూస్తున్నారు.