యాదాద్రిలో నేడు కేసీఆర్ ప‌ర్య‌ట‌న‌..

-

యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి పునర్నిర్మాణ ఆలయ పనులు దాదాపు పూర్తయ్యాయి. ఇక ఆలయాన్ని సంప్రదాయబద్ధంగా ముహూర్తం ప్రకారం ప్రారంభించడమే మిగిలివుంది. ఇందుకు సంబంధించి తెలంగాణ సీఎం కేసీఆర్ ఇవాళ యాదాద్రి పర్యటనకు వెళ్తున్నారు. ఆ రోజు ఉదయం 11 గంటలకు గుట్టకు చేరుకుని బాలాలయంలో స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం ఆలయ పునర్నిర్మాణం, పరిసరాల అభివృద్ధి పనుల పురోగతిని సీఎం పరిశీలించనున్నారు. అలాగే ప్రెసిడెన్షియల్ సూట్, ఇతర కాటేజీల నిర్మాణాలను పరిశీలించనున్నారు.

ఇటీవల ఈ ఆలయ నిర్మాణం, ప్రతిమలు, విగ్రహాల నిర్మాణంలో విమర్శలు రావడంతో… వాటిని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ఇవాళ్టి పర్యటనలో ఇలాంటి అంశాల్ని కూడా కేసీఆర్ చర్చిస్తారని తెలిసింది. ఆలయం ఎప్పుడు ప్రారంభించేదీ ముహూర్తం నిర్ణయించాక… మహా సుదర్శన నరసింహ యాగం చేస్తామని ఇదివరకు కేసీఆర్ హామీ ఇచ్చారు. దాదాపు 100 ఎకరాల్లో 1,018 యజ్ఞకుండాలతో మహా సుదర్శన యాగానికి అనువైన స్థలంగా గండి చెరువు ప్రాంతాన్ని ఎంపిక చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news