పోలీసులు ఎందుకు ఇంత దిగజారి పోయారో డీజీపీ సమాధానం చెప్పాలి : వర్ల రామయ్య

-

ఎన్నికల కమిషన్ ని టీడీపీ నేతలు శుక్రవారం కలిశారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రధాన ఎన్నికల అధికారి ముకేష్ కుమార్ మీనాకు ఏపీ పోలీసులపై టీడీపీ సీనియర్ నేత వర్లరామయ్య ఫిర్యాదు చేశారు.పోలీసు వాహనాలను ప్రజా రక్షణకు వాడాలని.. ముఖ్యమంత్రి జగన్ అవినీతి సొమ్ము ఓటర్లకి చేరవేయడానికా వాడడం ఏంటని ఆయన ప్రశ్నించారు.పోలీసులు ఎందుకు ఇంత దిగజారి పోయారో డీజీపీ రాజేంద్రనాధ్ రెడ్డి సమాధానం చెప్పాలని వర్ల రామయ్య డిమాండ్ చేశారు. కనీసం ఈ విషయాన్ని డీజీపీ ఎందుకు ఖండించట్లేదని ఆయన నిలదీశారు.

ముఖ్యమంత్రి జగన్‌కు చెందని సాక్షి పేపర్‌లో వచ్చే వార్తలను అడ్వర్టైజ్ మెంట్‌గా, పెయిడ్ ఆర్టికల్స్‌గా భావించి అభ్యర్థుల లెక్కల్లో చేర్చాలని డిమాండ్ చేశారు. పోస్టల్ బ్యాలెట్లు 90 శాతం డిస్ట్రిబ్యూట్ చేశామని సీఎస్ జవహర్ పచ్చి అబద్ధాలు ఆడుతున్నారని మండిపడ్డారు .

వృద్ధాప్య పింఛన్లు బ్యాంకుకు పంపితే వారు ఎలా వెళ్తారని.. ఎలా తెచ్చుకుంటారని నిలదీశారు. 2 రోజుల్లోనే 90శాతం పెన్షన్లు ఇచ్చామన్నారని.. అయితే అది వెళ్లింది బ్యాంకులకు కాదన్నారు. చాలా ఎకౌంట్లు ఫ్రీజ్ అయ్యాయని ఆ డబ్బులు తిరిగి ఇక్కడికే వస్తున్నాయని విమర్శించారు.

Read more RELATED
Recommended to you

Latest news