నేను చంద్రబాబు చెప్తేనే నీకోసం 3200 KM పాదయాత్ర చేశానా ? : వైఎస్ షర్మిల

-

సీఎం వైఎస్ జగన్‌పై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల షాకింగ్ కామెంట్స్ చేశారు. ముఖ్యమంత్రి జగన్ మానసిక పరిస్థితి చూస్తుంటే తనకు భయంగా ఉందని అన్నారు.శనివారం మీడియాతో మాట్లాడిన వైఎస్ షర్మిల.. జగన్ తనపై తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని మండిపడ్డారు.

‘నేను చంద్రబాబు చెప్తేనే నీకోసం 3200 KM పాదయాత్ర చేశానా ? ‘బాయ్ బాయ్ బాబు’ అనే క్యాంపెయిన్ చేశానా? అని ప్రశ్నించారు. సునీత, రేవంత్ కూడా చంద్రబాబు చెప్పినట్లు వింటారట. బీజేపీ పొత్తు కూడా చంద్రబాబు నాయుడు మ్యానేజ్ చేశాడట. చంద్రబాబు ఎంత పవర్ ఫుల్ అయ్యారో.. ఆయనను పెద్ద చేసి చూపిస్తున్నారో ఆలోచన చేయాలి అని తెలిపారు. జగన్ మానసిక పరిస్థితిపై నాకు ఆందోళనగా ఉంది. జగన్ గారు.. మీరు అద్దం చూస్కోండి.. మీకు మీ మొహం కనిపిస్తుందా? చంద్రబాబు మొహం కనిపిస్తుందా? చూడండి.సునీత చేస్తున్న న్యాయ పోరాటం మీకు కనిపించడం లేదా ? అని విమర్శించారు. హత్య వెనుక అవినాష్ రెడ్డి హస్తం, మీ హస్తం లేకుంటే మీకు భయం ఎందుకు?’ అనిముఖ్యమంత్రి జగన్‌ను షర్మిల నిలదీశారు.

Read more RELATED
Recommended to you

Latest news