ఫేక్ రేప్ కేసు.. మహిళకు నాలుగేళ్లు జైలు శిక్ష

-

తన కుమార్తెపై అత్యాచారం చేశాడంటూ ఓ మహిళ పెట్టిన తప్పుడు కేసు కారణంగా ఓ యువకుడు సుమారు నాలుగేళ్లు జైలులో గడిపాడు. చివరకు అసలు నిజం బయటపడడంతో కోర్టు అతడిని నిర్దోషిగా ప్రకటించి.. తప్పుడు కేసు పెట్టినందుకు బాలిక తల్లిపై 340 సెక్షన్‌ కింద కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది. అంతేకాకుండా ఆ యువకుడు 1,653 రోజులు జైలులో గడిపేలా చేసినందుకు.. ఆమెను కూడా జైల్లో అన్ని రోజులపాటు ఉంచాలని తీర్పునిచ్చింది.

ఏం జరిగిందంటే..?

ఉత్తర్‌ప్రదేశ్‌లోని బరేలీలోని బరాదరి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో నివసించే ఓ మహిళ తన 15ఏళ్ల కూతురిని అజయ్‌ అలియాస్‌ రాఘవ్‌ దిల్లీకి తీసుకెళ్లాడని, మత్తు పదార్థాలు ఇచ్చి అత్యాచారం చేశాడని 2019 డిసెంబరు 2న పోలీసులకు ఫిర్యాదు చేసింది.  దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు బాలికను న్యాయస్థానంలో హాజరుపరచగా.. అజయ్‌ తనపై అత్యాచారం చేశాడంటూ బాలిక వాంగ్మూలం ఇచ్చింది. ఈ కేసు అప్పటి నుంచి పెండింగ్‌లో ఉండగా నిందితుడు నాలుగేళ్లుగా జైల్లో ఉన్నాడు. ఆ తర్వాత కోర్టులో విచారణ సందర్భంగా.. బాలిక తాను అంతకుముందు ఇచ్చిన వాంగ్మూలం తప్పని న్యాయమూర్తి ఎదుట అంగీకరించింది. దీంతో అదనపు సెషన్స్‌ న్యాయస్థానం అజయ్‌ను నిర్దోషిగా ప్రకటించి మహిళపై కేసు నమోదు చేయాలని ఆదేశిస్తూ 1,653 రోజులు జైల్లో ఉంచాలని తీర్పునిస్తూ రూ.5,88,822 జరిమానా విధించారు.

Read more RELATED
Recommended to you

Latest news