దేశంలో మత కలహాలు కావాలా?.. శాంతి కావాలా? : కిషన్ రెడ్డి

-

దేశంలో మత కలహాలు కావాలా?.. శాంతి కావాలా? అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ప్రశ్నించారు. ప్రజలంతా శాంతియుతంగా కలిసి మెలిసి జీవించాలంటే బీజేపీ మళ్లీ అధికారంలోకి రావాలని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకుని.. ఓటేసిన తర్వాత ఫొటో తీసుకుని సోషల్ మీడియాలో పోస్టు చేయాలని కోరారు. సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ముషీరాబాద్లో బీజేపీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభకు ముఖ్యఅతిథిగా ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి హాజరయ్యారు. ఆయనతోపాటు కిషన్ రెడ్డి, లక్ష్మణ్ కూడా పాల్గొని ప్రసంగించారు.

“మోదీ హయాంలో 13 కోట్ల మరుగుదొడ్లు నిర్మించాం. కాంగ్రెస్‌ హయాంలో ఉగ్రవాదులు వచ్చి దేశ ప్రజలను చంపేవారు. కాంగ్రెస్‌ హయాంలో జమ్ము కశ్మీర్‌లోనే 42 వేలమంది పౌరులను ఉగ్రవాదులు చంపారు. కాంగ్రెస్‌ పాలన ఉన్నప్పుడు పాకిస్థాన్‌ ఏమనుకుంటే అది భారత్‌లో జరిగేది. మోదీ హయాంలో సర్జికల్‌ స్ట్రైక్స్‌ చేసి ఉగ్రవాదులను మట్టుబెట్టాం. బీజేపీ పాలనలో పాకిస్థాన్‌ తోక కత్తిరించాం.” అని కిషన్ రెడ్డి అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news