బీజేపీతో పోరాడేది బీఆర్‌ఎస్ పార్టీ మాత్రమేనని మాజీ మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. కాంగ్రెస్‌కు ఓటు వేస్తే బీజేపీకే లాభం చేకూరుతుందని సిద్దిపేటలో నిర్వహించిన ముస్లిం మైనార్టీల సమావేశంలో హరీశ్‌రావు అన్నారు. ముస్లిం మైనార్టీల సంక్షేమానికి బీఆర్‌ఎస్ పార్టీ కృషి చేస్తుందని అన్నారు. మైనార్టీల పిల్లల చదువుల కోసం రెసిడెన్షియల్ సూళ్లను 204 పెంచిన ఘనత కేసీఆర్‌దే ప్రశంసల వర్షం కురిపించారు.
బీజేపీతో పోరాట ఫలితంగానే కేసీఆర్ కుమార్తె కవిత జైలుకు వెళ్లాల్సి వచ్చిందని ,బీజేపీతో తాము కలిసి ఉంటే కవిత అరెస్టు అయ్యేవారా అని హరీష్ రావు ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి బీజేపీతో మిలాఖత్ అయి బీఆర్‌ఎస్‌ను లేకుండా చేయాలని కుట్ర చేస్తున్నట్లు మండిపడ్డారు. లోక్ సభ ఎన్నికలు అయిపోయిగానే బీజేపీ, కాంగ్రెస్ నాయకులు ఎవరూ మీకు అందుబాటులో ఉండరని ,మళ్లీ ప్రజలకు అందుబాటులో ఉండేది బీఆర్‌ఎస్ పార్టీ నాయకులే అని అన్నారు.నేడు రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన అంతా రివర్స్ గేర్‌లో నడుస్తున్నదని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ వాళ్లు మాటలు చెప్పడం తప్ప, మైనార్టీలకు రూపాయి ఇవ్వలేదని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం మైనార్టీల సంక్షేమానికి బడ్జెట్‌లో రూ.4 వేల కోట్లు కేటాయించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు.