తెలుగురాష్ట్రాల్లో భానుడి ఉగ్రరూపంతో పగటి పూటే కాకుండా రాత్రి పూట కూడా జనం ఉక్కిరి బిక్కిరి అవుతున్న సమయంలో ఇటీవల కురిసిన వర్షానికి వాతావరణం లో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి.
రాష్ట్రంలో మరో 5 రోజులు వర్షాలు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. రేపు ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, కరీంనగర్,సిరిసిల్ల, పెద్దపల్లి, ములుగు, భద్రాద్రి, నిజామాబాద్,ఖమ్మం, సిద్దిపేట, హైదరాబాద్, మెదక్, కామారెడ్డి, వనపర్తి జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయంటూ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.