ఎన్నికల నేపథ్యంలో రేపటి నుంచి మూడ్రోజుల వరకు రాష్ట్రంలో ఆంక్షలు

-

హైదరాబాద్‌లో లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు ఆంక్షలు విధించారు. ఎక్కువ మంది గుమి గూడడంపై ఆంక్షలు విధిస్తూ హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్‌ కమిషనర్లు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 11వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి 14వ తేదీ ఉదయం 6 గంటల వరకూ ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని అధికారులు సృష్టం చేశారు.

ఈ నెల 13వ తేదీన పోలింగ్‌ రోజున పోలింగ్‌ కేంద్రాలకు 200 మీటర్ల పరిధిలో 144 సెక్షన్‌ అమల్లో ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. పోలింగ్ పరిధిలో ఐదుగురు అంతకుమించి గుమిగూడొద్దని స్పష్టం చేశారు. శనివారం సాయంత్రం నుంచి సోమవారం సాయంత్రం వరకూ అన్ని రకాల ప్రచార కార్యక్రమాలపై నిషేధం అమల్లో ఉంటుందని పోలీసులు తెలియజేశారు. వ్యక్తులు, వర్గాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే ప్లకార్డులు, చిత్రాలు, గుర్తులు ప్రదర్శించడం నిషేధమని వెల్లడించారు.  కల్లు దుకాణాలు, బార్లు, మద్యం విక్రయించే అన్ని సంస్థలూ మూసేయాలని స్పష్టం చేశారు. ఈ ఆదేశాలు ఉల్లంఘిస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు ఉంటాయని మూడు కమిషనరేట్ల సీపీలు హెచ్చరికలు జారీ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news