మోసపోతే గోసపడుతాం.. జాగ్రత్త…కేసిఆర్ కీలక వ్యాఖ్యలు

-

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్‌లో కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ….రాజన్న సిరిసిల్ల జిల్లా.. దేవుని పేరు కూడా ఉండాలని వేములవాడ రాజన్న పేరును సిరిసిల్ల జిల్లాకు పెట్టుకున్నాం అని గుర్తు చేశారు. ఈ ఎన్నికల్లో మూడు పార్టీలు రంగంలో ఉన్నాయి. ఏ పార్టీలు ఏం చేశాయో మీకు అందరికీ బాగా తెలుసు అని అన్నారు కేసిఆర్.మోసపోతే గోసపడుతాం.. జాగ్రత్త అని మనవి చేస్తున్నా అని కేసీఆర్ పేర్కొన్నారు.

ఇది చేనేతలు ఎక్కువగా నివసించే ప్రాంతం. గతంలో చేనేతల ఆత్మహత్యలు జరిగితే కన్నీళ్లు పెట్టుకున్నా.. బాధపడ్డాను అని కేసిఆర్ అన్నారు.అనేక స్కీమ్స్ తెచ్చి బతుకమ్మ చీరలు, స్కూల్ డ్రస్సులు, క్రిస్మస్, రంజాన్ కానుకలు ఆర్డర్లుగా ఇచ్చి చేనేత కార్మికులకు ఉపాధి కల్పించాం అని కేసిఆర్ తెలిపారు. రూ. 372 కోట్ల బకాయిలు రావాల్సి ఉందని ,కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇవ్వమని అడిగితే నిరోధ్‌లు, పాపడలు అమ్ముకోండని కాంగ్రెస్ నేతలు అంటే కోపం వచ్చి ఒక మాట అన్నాను. దాంతో నా మీద 48 గంటల నిషేధం పెట్టారు. చేనేత, పద్మశాలిలను అవమానించారని మాట్లాడితే నిషేధం పెట్టారు అని మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news