మళ్లీ పవన్ కళ్యాణ్ పెళ్లిలపై ఘాటు వ్యాఖ్యలు చేసిన సీఎం జగన్

-

ఎన్నికల ప్రచారానికి ఈ రోజే చివరి తేదీ కావడంతో ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో భాగంగా పిఠాపురంలో చివరి ప్రచార సభలో ముఖ్యమంత్రి జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి ఘాటైన వ్యాఖ్యలు చేశారు.దత్తపుత్రుడు 5 సంవత్సరాలకి ఒకసారి కార్లను మార్చినట్లు భార్యలను మారుస్తాడని అన్నారు.ఇలాంటి పవన్ ను మహిళలు నమ్మే పరిస్థితిలో ఉన్నారా అని జగన్ ప్రశ్నించారు.

పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో గెలిస్తే పిఠాపురంలో ఉండరని, హైదరాబాద్ వెళ్ళిపోతారని విమర్శించారు. గత ఎన్నికల్లో గాజువాక, భీమవరం అన్నాడు, ఇప్పుడు పిఠాపురం అంటున్నాడు, ఎన్నికలయ్యాక హైదరాబాద్ పారిపోతాడని అన్నారు ముఖ్యమంత్రి జగన్. మొదటి నుండి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గంపై స్పెషల్ ఫోకస్ పెట్టిన జగన్, చివరి ప్రచార సభను కూడా అక్కడే నిర్వహించారు. మరి ఈ సభ వంగా గీత గెలుపుపై ఏ మేరకు ప్రభావం చూపుతుందో వేచి చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news