సమాజంలో మార్పు రావాలనే రాజకీయాల్లోకి వచ్చానని జనసేనాని పవన్ కళ్యాణ్ అన్నారు. తాాజాగా నిర్వహించిన కాకినాడ ప్రచార సభలో ఆయన ప్రసంగించారు. వైసీపీకి ఓటు వేస్తే.. చేజేతులా గూండా ప్రభుత్వాన్ని తెచ్చుకున్నట్టేనని తెలిపారు. తన దేశం, ప్రాంతాన్ని రౌడీల చేతికి ఇవ్వడం ఇష్టం లేదన్నారు. ఎన్నో దెబ్బలు తిని పదేళ్లుగా ఇక్కడే నిలబడి ఉన్నానని తెలిపారు. పార్టీలు మారే వ్యక్తులు కాకుండా స్థిరంగా ఉండేవారు కావాలని చెప్పారు.
మరోవైపు ఇవాళ పవన్ కళ్యాణ్ నివాసానికి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, చిరంజీవి సతీమణి సురేఖ, అల్లు అరవింద్ వెళ్లి పవన్ కి మద్దతు తెలిపారు. మరోవైపు అల్లు అర్జున్ తన స్నేహితుడు శిల్ప రవి వైసీపీ అభ్యర్థిని గెలిపించాలని కోరడం గమనార్హం. తండ్రి జనసేన కోసం పిఠాపురం వెళ్తే.. కొడుకు వైసీపీ కోసం నంద్యాల వెళ్లాడని సోషల్ మీడియాలో చర్చించుకోవడం విశేషం.