కేసీఆర్ ఈజ్ డెఫినెట్లీ ఎమోషన్ ఆఫ్ తెలంగాణ : కేసిఆర్

-

నా గుండెల్లో తెలంగాణ ఉంటది.. తెలంగాణ ప్రజల గుండెల్లో కేసీఆర్ ఉంటడు అని కేసీఆర్ అన్నారు.గెలుపోటములు పక్కన పెడితే కేసీఆర్ ఈజ్ డెఫినెట్లీ ఎమోషన్ ఆఫ్ తెలంగాణ అని అన్నారు.వంద శాతం కేసీఆర్‌కు ఆ బాండేజ్ ఉంటదని కేసీఆర్ తెలిపారు. తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేసిఆర్ మాట్లాడుతూ… కేసీఆర్ ఈజ్ ద హిస్టరీ ఆఫ్ తెలంగాణ. కేసీఆర్ తెలంగాణకు ఉన్న బంధం అది.

దిక్కు దివానా లేనప్పుడు నా పదవులు నా రాజకీయ భవిష్యత్‌ను ఫణంగా పెట్టినా తెలంగాణ కోసం ఎంత కష్టపడ్డానో తెలంగాణ ప్రజలకు తెలుసు అని గుర్తు చేశారు. నా గుండెల్లో తెలంగాణ ఉంటది.. తెలంగాణ ప్రజల గుండెల్లో కేసీఆర్ ఉంటడు. కేసీఆర్‌ను గిల్లి పడేస్తాం అనుకుంటే వాడు పిచ్చోడు అయితడు తప్ప తెలంగాణ ప్రజలు కారు అని కేసీఆర్ విమర్శించారు. హైదరాబాద్ రెండో రాజధాని అయితే బాగుంటుందని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే లాంటి వ్యక్తి మాట్లాడం దురదృష్టకారం అని మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news