బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ది పదవీ వ్యామోహం అని, ప్రజలు అసెంబ్లీ ఎన్నికల్లో తుక్కుతుక్కుగా ఓడించినా ఇంకా బుద్ధి రాలేదని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విమర్శించారు. బీఆర్ఎస్, బీజేపీ వేర్వేరు కాదని, ఆ రెండు పార్టీలూ ఒక తాను ముక్కలేనని అన్నారు .ఎన్నికల ప్రచారమ చివరి రోజైన శనివారం కాంగ్రెస్ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గత ప్రభుత్వం నిర్వాకoతోనే నేడు రాష్ట్రంలో నీటి కష్టాలు మొదలయ్యాయని మండిపడ్డారు.
కేసీఆర్ నోరు తెరిస్తే అన్నీ అబద్ధాలే మాట్లాడతారని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఆయన హయాంలో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు.. ఆ ప్రభుత్వ కాలంలోనే కుంగిందని అన్నారు. మాజీ సీఎం కేసీఆర్ పగటిపూటేమో బీజేపీపై విమర్శలు చేస్తూ.. రాత్రి అయ్యాక ఆ పార్టీ పెద్దలతో కూర్చొని.. మంతనాలు జరుపుతారని ఆరోపించారు . నిరుద్యోగుల బాధ, రైతుల కష్టాలు, మహిళాల ఆవేదన ఎప్పుడూ పట్టించుకోలేదని ,సొంత నియోజకవర్గంలో కూడా గెలవలేక ఫామ్ హౌస్ కే పరిమితమయ్యాడని మంత్రి పొంగులేటి అన్నారు.