Mumbai Indians vs Lucknow Super Giants, 67th Match: ఇండియన్ ప్రీమియర్ లీగ్ చివరి దశకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ప్లే ఆఫ్ స్థానాలను మూడు జట్లు ఖరారు చేసుకున్నాయి. మరో జుట్టు ప్లే ఆఫ్ కు వెళ్లాల్సి ఉంది. ఇలాంటి నేపద్యంలో ఇవాళ నామమాత్రపు మ్యాచ్ జరగనుంది.
ఇవాళ… ముంబై ఇండియన్స్ వర్సెస్ లక్నో సూపర్ జెంట్స్ మధ్య 67వ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. ముంబైలోని వాన్ కాడే స్టేడియంలో ఈ మ్యాచ్ నిర్వహిస్తున్నారు. ఈ మ్యాచ్ లో ఏ జట్టు గెలిచినా ఎవరికి ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఎందుకంటే చెన్నై సూపర్ కింగ్స్ లేదా బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్టలో ఏదో ఒక జట్టు ప్లే ఆఫ్ కు వెళ్తుంది.