అనంతపురం జిల్లా తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి బిగ్ షాక్ ఇచ్చారు ఏపీ పోలీసులు. తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంట్లో సీసీ కెమెరాలు, కంప్యూటర్లు, ఫర్నీచర్ ధ్వంసం చేశారు పోలీసులు. అయితే.. ఈ విషయాన్ని ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది వైఎస్సార్ సీపీ.
అటు తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంట్లో సీసీ కెమెరాలు, కంప్యూటర్లు, ఫర్నీచర్ ధ్వంసం చేసిన వీడియో వైరల్ గా మారింది. పోలీసుల వైఖరిని తప్పుపట్టిన వైఎస్సార్ సీపీ లీగల్ సెల్, తాడిపత్రి పోలీసులుప్తె ఎన్నికల సంఘానికి ఆధారాలు సమర్పించారు న్యాయవాదులు ఉమాపతి, సత్యనారాయణ రెడ్డి. ఇక అటు కేతిరెడ్డి పెద్దారెడ్డి , జెసి ప్రభాకర్ రెడ్డి ఇళ్ల వద్ద పోలీసుల బందోబస్తు ఉంది. బాష్పవాయువు ప్రయోగం సమయంలో అస్వస్థతకు గుర్తెయి సికింద్రాబాద్ లోని ప్త్రెవేట్ ఆస్పుత్రిలో చికిత్స పొందుతున్నారు జెసి ప్రభాకర్ రెడ్డి. తాడిపత్రికి దూరంగా ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఉన్నారు.