కడుపు, శరీరం పై దాడి చేశాడు.. స్వాతి మలివాల్ వాంగ్మూలంలో వెల్లడి

-

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నివాసంలో ఆ పార్టీ రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్ పట్ల అనుచితంగా ప్రవర్తించిన కేజ్రీవాల్ వ్యక్తిగత కార్యదర్శి విభవ్ కుమార్ పై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోద చేశారు. ఫిర్యాదలో కేవలం విభవ్ ని మాత్రమే నిందితుడిగా చేర్చారు. కాలితో తన్నారని, కడుపు, శరీరం పై కూడా దాడి జరిగిందని.. సున్నితమైన భాగాలపై తన్నాడని పేర్కొంది. దర్యాప్తులో భాగంగా స్వాతి మలివాల్ వాంగ్మూలాన్ని పోలీసులు తీసుకున్నారు.

స్వాతి మలివాల్ పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం.. “  విభవ్ నన్ను చెప్పుతో కొట్టడం ప్రారంభించాడు. నేను అరుస్తూనే ఉన్నాను. అతను నన్ను కనీసం 7-8 సార్లు కొట్టాడు. నేను పూర్తిగా షాక్ లో ఉన్నాను. సహాయం కోసం మళ్లీ మళ్లీ అరుస్తున్నాను. నన్ను రక్షించుకోవడానికి నేను అతనిని నా కాళ్ళతో దూరంగా నెట్టాను. ఇంతలో అతను మళ్ళీ నాపై విరుచుకుపడ్డాడు. కనికరం లేకుండా కొట్టడం ప్రారంభించాడు. నా చొక్కా లాగాడు. నా షర్ట్ బటన్స్ ఓపెన్ అయ్యాయి. అతను నా తల పట్టుకుని టేబుల్ మీద కొట్టాడు. నేను సహాయం కోసం అరుస్తూ నే ఉన్నాను.

విభవ్ కుమార్ నా ఛాతీ, పొట్ట, నడుము కింది భాగంలో కాళ్లతో తన్నుతూ నాపై దాడి చేశాడు. నేను చాలా బాధలో ఉన్నాను. నేను అతడిని ఆపమని వేడుకుంటున్నాను. అయినా అతను నాపై దాడి చేస్తూనే ఉన్నాడు. నాకు పీరియడ్స్ వస్తున్నాయని.. నాకు చాలా బాధగా ఉందని పదే పదే చెప్పాను. అయినప్పటికీ, అతను ఏమాత్రం కనికరం చూపలేదు.  ఎలాగోలా తప్పించుకుని పారిపోయాను. ఈ దాడి తర్వాత నేను షాక్ అయ్యాను. నేను తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాను. 112కి కాల్ చేసి సంఘటన గురించి తెలియజేశాను.” అని ఆమె పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news