తారక్ బ‌ర్త్‌డే స్పెష‌ల్.. దేవ‌ర నుంచి కొత్త పోస్ట‌ర్ రిలీజ్

-

జూనియర్ ఎన్టీఆర్ హీరోగా చేస్తున్న తాజా చిత్రం ‘దేవర. కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో అతిలోక సుందరి శ్రీదేవి గారాల పట్టి జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది.  ‘దేవర’తో జాన్వీ తెలుగు సినిమా ఇండ‌స్ట్రీకి పరిచయం అవుతుంది. బీ టౌన్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ విలన్‌గా న‌టిస్తున్నాడు. ఈ సినిమా రెండు భాగాలుగా రానుండ‌గా.. తొలి భాగం 2024 అక్టోబ‌ర్ 10వ తేదీన విడుద‌ల కానుంది.

అయితే ఇవాళ తార‌క్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఇప్ప‌టికే దేవ‌ర నుంచి ఫ‌స్ట్ సింగిల్ ఫియ‌ర్ సాంగ్ విడుద‌ల చేశారు. ఈ పాట విడుదలైన కాసేపట్లో రికార్డు వ్యూస్ తో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇక తారక్ బర్త్ డే స్పెషల్ గా దేవర టీమ్ మరో సర్ ప్రైజ్ ఇచ్చింది. ఈ సినిమాలో తారక్ కు సంబంధించి మరో కొత్త పోస్టర్ రిలీజ్ చేసింది. ఎన్టీఆర్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతూ ఈ పోస్టర్ ను నెట్టింట పోస్టు చేశారు మేకర్స్.  పోస్ట‌ర్‌లో ఎన్టీఆర్ స‌ముద్రం ఒడ్డున‌ కూర్చొని పిల్లలతో ముచ్చట పెడుతున్నట్లు కనిపిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news