పూరి జగన్నాథ్ `ఫైటర్‌`లో ఆర్ఎక్స్ 100 హీరో

-

ఇస్మార్ట్ శంకర్‌ సినిమాతో సూపర్‌ హిట్ కొట్టిన పూరి తిరిగి ఫుల్‌ ఫాంలోకి వచ్చాడు. చాలా రోజులుగా సాలిడ్‌ హిట్‌ కోసం ఎదురుచూస్తున్న పూరికి ఇస్మార్ట్‌ శంకర్‌ సక్సెస్‌ కొత్త ఊపు ఇచ్చింది. ఇస్మార్‌ శంకర్‌ తరువాత విజయ్‌ దేవరకొండ హీరోగా ఫైటర్‌ సినిమాను ఎనౌన్స్‌ చేశాడు పూరి జగన్నాథ్. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ కార్యక్రమాల శరవేగంగా జరుగుతున్నాయి. మ‌రోవైపు.. విజ‌య్ దేవరకొండ తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి ‘వరల్డ్ ఫేమస్ లవర్’ సిద్ధమవుతోంది. ఈ సినిమా తరువాత ఆయన పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ‘ఫైటర్’ సినిమా చేయనున్నాడు.

 

ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు చకచకా జరుగుతున్నాయి. ఈ సినిమాలో కథానాయికగా జాన్వీ కపూర్ నటించనుందనే టాక్ బలంగా వినిపిస్తోంది. ఇక కీలకమైన పాత్రలో కార్తికేయ కనిపించనున్నాడని అంటున్నారు. అయితే అది ప్రత్యేకమైన పాత్రనా? లేదంటే విలన్ పాత్రనా? అనే విషయంపై స్పష్టత రావలసి వుంది. కాగా, ‘నానీస్ గ్యాంగ్ లీడర్’ సినిమాలో కార్తికేయ విలన్ గా మంచి మార్కులు కొట్టేశాడు. అందువలన ‘ఫైటర్’ సినిమాలోను ఆయన విలన్ గా కనిపించే అవకాశం లేకపోలేదని అంటున్నారు. త్వరలోనే ఈ విషయంపై క్లారిటీ రానుంది.

Read more RELATED
Recommended to you

Latest news