రియల్టర్ మధు హత్య కేసులో సంచలన విషయాలు…వెలుగులోకి వస్తున్నాయి. బిల్డర్ మధుకు 200 కోట్ల ఆస్తి ఉందని… మధు.. చీకోటి రామ్ అనుచరుడు అని తెలుస్తోంది. మధును చంపింది ఆయన స్నేహితులే అని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కల్పన సొసైటీలో ఉంటున్నారట నిందితులు.. రేణుకా ప్రసాద్, లిఖిత్ సిద్ధార్థ్‌రెడ్డి వరుణ్‌తో మధుకు స్నేహం ఏర్పడింది. క్యాసినో ఆటలో మధుకు, రేణుకా ప్రసాద్ గ్యాంగ్‌తో స్నేహం ఏర్పడింది.
క్యాసినో ఆడుదామని తీసుకునివెళ్లి మధు దారుణ హత్య చేశారట. మధుకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారట. మధుకు నవరాత్రులు ఘనంగా నిర్వహించే అలవాటు ఉందట. నవరాత్రుల టైంలో పూజలో మధు ఉన్న తరుణంలోనే మధు చిన్న కూతురుపై కన్నేసిన రేణుకా ప్రసాద్.. ఆమెను ప్రేమలోకి దింపాడు. మధుకు తమ ప్రేమ విషయం చెప్పి…కూతుర్ని ఇచ్చి పెళ్లి చేయమన్నాడు రేణుకా ప్రసాద్.
రేణుకా ప్రసాద్‌తో కూతురు పెళ్లికి ఒప్పుకోలేదు మధు. ఇక పెళ్లికి ఒప్పుకోకపోవడంతో కక్ష పెంచుకున్నాడట రేణుకా ప్రసాద్. ఈ మధ్యే చిన్నకూతురికి పెళ్లి సంబంధం కుదిర్చాడు మధు. ప్రేమను దూరం చేసిన మధును చంపడానికి రేణుకా ప్రసాద్ స్కెచ్ వేశాడట. ముందుగా హైదరాబాద్‌లోనే హత్యకు ప్రణాళిక వేశాడట. సుపారీ గ్యాంగ్‌ను నెలరోజులు హైదరాబాద్‌లో ఉంచిన రేణుకా ప్రసాద్… హైదరాబాద్‌లో హత్యకు పరిస్థితులు అనుకూలించకపోవడంతో.. క్యాసినో ఆడుదామని బీదర్‌కు తీసుకెళ్లి దారుణంగా హత్య చేశాడట.