తన మధ్యంతర బెయిల్ పొడిగించాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టులో వేసిన పిటిషన్పై కేంద్రమంత్రి, బీజేపీ నేత అనురాగ్ ఠాకూర్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఎన్నికల కోసం 47 °C ఎండలోనూ రోడ్డుషోలో పాల్గొంటున్న అరవింద్ కేజ్రివాల్ ఆరోగ్యం బాగాలేదని చెబుతూ బెయిల్ కోరడం విడ్డూరమని ఆయన అన్నారు.కేజ్రివాల్ చేస్తున్నది ప్రజలంతా గమనిస్తున్నారని ఠాకూర్ చెప్పుకొచ్చారు.
కాగా, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కేజ్రీవాల్ ను ఈడీ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఢిల్లీ రౌస్ ఎవెన్యూ కోర్టు జ్యుడీషియల్ రిమాండ్ విధించడంతో కేజ్రీవాల్ ను తీహార్ జైలుకు పోలీసులు తరలించారు. అయితే,అనారోగ్య కారణాలు దృష్ట్యా తనకు బెయిల్ ఇవ్వాలని సుప్రీం కోర్టును కేజ్రీవాల్ ఇటీవల ఆశ్రయించగా.. జూన్ 1వ తేదీ వరకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.