ఏపీలో ఐసెట్ , ఈసెట్ ప్రవేశ పరీక్షల ఫలితాలను మే 30న ఒకే రోజు అధికారులు విడుదల చేయనున్నారు.ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఆంధ్ర ప్రదేశ్ ఐసెట్-2024 ఫలితాలను సాయంత్రం 4గంటలకు రిలీజ్ చేయనున్నట్లు ఐసెట్ కన్వీనర్ మురళీకృష్ణ తెలిపారు. మే 6న ఏపీలో 111, తెలంగాణలో 2 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించిగా మొత్తంగా 48,828 మంది దరఖాస్తు చేసుకోన్నారు. అందులో 44,446 మంది పరీక్షలకు హాజరయ్యారు.
పాలిటెక్నిక్ పూర్తి చేసిన విద్యార్థులు బీటెక్ ద్వితీయ సంవత్సరంలో ప్రవేశానికి నిర్వహించిన ఏపీఈసెట్-2024 ఫలితాలను అనంతపురం- జేఎన్‌టీయూలో గురువారం ఉదయం 11 గంటలకు రిలీజ్ చేయనున్నట్లు ఈసెట్ ఛైర్మన్ శ్రీనివాసరావు, కన్వీనర్ భానుమూర్తి వెల్లడించారు. మే 8న AP ECET పరీక్షలు నిర్వహించగా.. రాష్ట్రవ్యాప్తంగా 36,369 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు.