తెలంగాణ గీతం ‘జయ జయహే తెలంగాణ’పై ప్రభుత్వం కసరత్తు పూర్తి చేసినట్లు తెలుస్తోంది. 13 చరణాలున్న ఈ గీతం 2.30నిమిషాల నిడివితో రూపొందించినట్లు సమాచారం. గతంలో ఇందులో 11 చరణాలుండేవి. ఇప్పుడు అదనంగా మరో 2 జోడించినట్లు తెలుస్తోంది. జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రజల ముందుకు రాష్ట్ర గీతాన్ని ప్రభుత్వం తీసుకురానుంది.
ఇదిలా ఉంటే… బుధవారం ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్, ఆస్కార్ పురస్కార గ్రహీత ఎం.ఎం.కీరవాణి, ఆయన గాన బృందంతో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తదితరులను కలిశారు. కీరవాణి స్వరపరిచిన పాటను విన్నారు. తెలంగాణ ఆత్మకు ప్రతిరూపంగా.. అస్తిత్వానికి ప్రతీకగా.. ఆత్మగౌరవాన్ని ప్రపంచం నలుమూలలా ఎలుగెత్తేలా.. సాంస్కృతిక ఘనతను ప్రతిబింబించేలా అందెశ్రీ రాసిన ఈ గీతం సుమారు 6 నిమిషాల నిడివి ఉంది. సీఎంతో పాటు, గీత రచయిత అందెశ్రీ, ప్రొ.కోదండరామ్ తదితరులు ఉన్నారు.