‘కల్కి’ భారీ బడ్జెట్ పై ప్రభాస్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

-

నాగ్‌ అశ్విన్‌ – ప్రభాస్‌ల కాంబోలో రానున్న సైన్స్‌ ఫిక్షన్‌ థ్రిల్లర్‌ ‘కల్కి 2898 ఏడీ’ . జూన్‌ 27న ఈ సినిమా విడుదల కానుంది. ఇప్పటికే మేకర్స్ ప్రమోషన్స్ షురూ చేశారు. ఇందులో భాగంగా ప్రభాస్‌, నాగ్‌ అశ్విన్‌లు ఓ ఇంగ్లీష్ మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా వాళ్లు కల్కి భారీ బడ్జెట్ గురించి మాట్లాడారు. ఈ సినిమాకు ఇంత పెద్ద బడ్జెట్ ఎందుకు అయిందో కారణం చెప్పారు.

‘‘కల్కి’ గ్లోబల్‌ రేంజ్‌లో ఉండనుంది. దీన్ని దేశవ్యాప్తంగా ఉన్న వారితో పాటు అంతర్జాతీయ ప్రేక్షకుల కోసం రూపొందించాం. అందుకే అంత ఎక్కువ బడ్జెట్‌ అయింది. దేశంలోని గొప్ప నటీనటులను తీసుకున్నాం. నన్ను అందరూ పాన్‌ ఇండియా స్టార్‌ అని పిలుస్తున్నారు. అది నాపై ఎలాంటి ప్రభావం చూపదు. కానీ, నన్ను అలా పిలవడాన్ని అభిమానులు ఇష్టపడతారు. వాళ్లకు ఆ పిలుపు సంతోషాన్నిస్తుంది’ అని కల్కి ముచ్చట్లు చెప్పుకొచ్చాడు రెబల్ స్టార్ ప్రభాస్.

Read more RELATED
Recommended to you

Latest news