నేడు తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్న అమిత్ షా

-

తిరుమల శ్రీవారి దర్శనార్థం గురువారం రాత్రి తిరుమల చేరుకున్న కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ఇవాళ (మే 31వ తేదీ) ఉదయం వీఐపీ బ్రేక్‌ సమయంలో తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. ఈరోజు ఉదయం 8.30 నిమిషాలకు వెంకన్న స్వామి సేవలో పాల్గొంటారు. దర్శనం అనంతరం తిరుపతి విమానాశ్రయం నుంచి అమిత్ షా నేరుగా రాజ్ కోట్ బయల్దేరి వెళ్లనున్నారు.

గురువారం రాత్రి ప్రత్యేక విమానంలో రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు బీజేపీ నేతలు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం తిరుమలలోని వకుళమాత నిలయం అతిథి గృహానికి చేరుకున్నారు. అక్కడ ఆయనకు ఈవో ఏవీ ధర్మారెడ్డి పుష్పగుచ్ఛం ఇచ్చి స్వాగతం పలికారు.  తిరుపతి, తిరుమలలో కేంద్రమంత్రి అమిత్ షా నివసించే అతిథిగృహాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఏపీలో జరిగిన ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడి పార్లమెంట్‌, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news