ఇందిరమ్మ రాజ్యం రావాలని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాప్రభుత్వంని తెచ్చుకున్నారని, వారందరికి త్వరలో ఇండ్లు ఇచ్చే బాధ్యత తనదేనని తెలంగాణ రాష్ట్ర రెవెన్యూశాఖ, గృహనిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. ఇవాళ ఆయన పాలేరులో పర్యటించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ పాలేరులో ప్రతి ఇంటి ముందు సీసీ రోడ్డు వేసే బాధ్యత తనదేనని, నియోజకవర్గంలో ప్రభుత్వ ఆస్తులు ఎవరి ఆక్రమణలో ఉన్నా స్వాధీనం చేసుకుని చుట్టూ ఫెన్సింగ్ నిర్మిస్తామని తెలిపారు. అన్నారు.
పేదవారికి అవసరమైన రెండు పోర్టు పొలియోల్లో తానే ఉన్నానని వారందరి కష్టసుఖాలు పాలుపంచుకుంటానని పేర్కొన్నారు. ప్రభుత్వ స్థలాలు అన్నీ బయటకు తీయించి అర్హులైన వారికి ఆ స్థలాలు ఇస్తాం అన్నారు. ప్రభుత్వ స్థలాలు ఆక్రమించిన వారు ఎంతటివారైనా వదిలే ప్రసక్తేలేదన్నారు గడిచిన పది సంవత్సరాల్లో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదని, కోడ్ ముగిసిన వెంటనే రేషన్కార్డులు, పింఛన్లు ఇస్తామన్నారు. తప్పకుండా మీ కష్టాలలో పెద్ద కొడుకుగా ఉండి పనిచేస్తానని, తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెడతానని అన్నారు. గంజాయి విషయంలో పోలీసులు ఉక్కుపాదం మోపాలని ఆదేశించారు.