మే 13, 2024న తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ లో లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలు.. తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు జరిగాయి. జూన్ 04న ఫలితాలు వెల్లడి కానున్నాయి. మరోవైపు దేశవ్యాప్తంగా 7 దశల్లో పోలింగ్ జరిగింది. చివరి దశ జూన్ 01న ముగిసింది. చివరి దశ ఎన్నికలు ముగియగానే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడించాయి పలు సర్వేలు.
ప్రధానంగా కేంద్రంలో ఎన్డీఏ కూటమినే అధికారంలోకి వస్తుందని సర్వేలు వెల్లడించాయి. ఏపీలో మరోసారి సీఎం జగన్ అవుతారని కొన్ని సర్వేలు వెల్లడించగా.. మరికొన్ని సర్వేలు చంద్రబాబు సీఎం అవుతారని వెల్లడించారు. తాజాగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సర్వేలపై స్పందించారు. నిన్న వచ్చినవి ఎగ్జిట్ పోల్స్ కావని.. మోడీ, మీడియా పోల్స్ అంటూ రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇండియా కూటమి ఎన్ని స్థానాలు గెలుస్తుందని మీడియా ప్రశ్నించగా.. సిద్ధు మూసే వాలా సాంగ్ విన్నారు కదా.. 295 వస్తాయని చెప్పి అక్కడి నుంచి వేగంగా వెళ్లిపోయారు. కాగా శనివారం సాయంత్రం వెలుబడ్డ ఎగ్జిట్ పోల్స్ అన్ని కేంద్రంలో మరోసారి బీజేపీ ప్రభుత్వం భారీ మెజారిటీతో వస్తుందని అంచనా వేశాయి.