జబర్దస్త్ పిలుస్తోంది కదలిరా.. రోజాకి బండ్ల గణేష్ కౌంటర్..!

-

ఆంధ్రప్రదేశ్ లో కూటమి అభ్యర్థులు విజయం దిశగా ముందంజలో ఉన్నారు. వైసీపీ కి చెందిన అభ్యర్థులు చాలా చోట్ల వెనుకంజలో ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు టీడీపీ 133, జనసేన 20, బీజేపీ 07 స్థానాల్లో ముందంజలో ఉండగా.. పార్లమెంట్ స్థానాలకు సంబంధించి టీడీపీ 16, వైసీపీ 04, బీజేపీ 3, జనసేన 2 స్థానాల్లో ముందంజలో ఉంది.

ఏపీలో ఎన్డీఏ కూటమి సునామి సృష్టిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తొలి రౌండ్ నుంచి టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థులు అధిక్యం కొనసాగిస్తున్నారు. కాగా, నగరి నుంచి పోటీ చేసిన ఏపీ మంత్రి రోజా ఓటమి దిశగా పయనిస్తున్నారు. టీడీపీ అభ్యర్థి గాలి భానుప్రకాష్ప 5333 ఓట్ల తేడాతో రెండో స్థానానికి పరిమితమయ్యారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేత, నిర్మాత బండ్ల గణేష్, రోజాకు ట్విట్టర్ వేదికగా కౌంటర్ ఇచ్చారు. జబర్దస్త్ పిలుస్తుంది రా కదిలారా అని రోజా ట్విట్టర్ హ్యాండిల్కు ట్యాగ్ చేశారు. ప్రస్తుతం బండ్ల గణేష్ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అంతకు ముందు బండ్ల గణేష్, రోజా మధ్య డైలాగ్ స్టార్ నడిచిన విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news