Chandrababu: కూటమికి బీజం వేసిన మొనగాడు… పవన్‌ కళ్యాణే

-

Chandrababu: కూటమికి బీజం వేసిన మొనగాడు… పవన్‌ కళ్యాణే అంటూ వ్యాఖ్యానించారు చంద్రబాబు. ఇవాళ మీడియాతో చంద్రబాబు మాట్లాడుతూ… రాజకీయాల్లో ఒడిదుడుకులు సహజం, ఎవరూ శాశ్వతం కాదని వెల్లడించారు. అధికారం శాశ్వతం కాదు.. ఇంత హిస్టారికల్‌ విజయం నేను ఎప్పుడూ చూడలేదని పేర్కొన్నారు బాబు.

Time and place fixed for Chandrababu’s oath taking

ఇతర ప్రాంతాల్లో ఉన్నవారు చిన్నస్థాయి నుంచి పెద్దవారి వరకు వచ్చి ఓటు వేశారని చెప్పారు. ఇది టీడీపీ చరిత్రలో, ఏపీ రాజకీయ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ ఎన్నికలు అంటూ కొనియాడారు చంద్రబాబు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలడానికి వీలులేదంటూ పవన్‌ కల్యాణ్‌ ముందుకొచ్చారని వివరించారు. కూటమికి పవన్‌ బీజం వేశారని తెలిపారు. బేషజాలు లేకుండా కూటమి పనిచేసిందని స్పష్టం చేశారు బాబు. పవన్‌ కల్యాణ్‌ను అభినందిస్తున్నాను.. మాపై ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ముచేయబోమని తెలిపారు చంద్రబాబు. ఎన్డీఏతోనే మా ప్రయాణం.. ఇవాళ ఎన్డీఏ సమావేశానికి హాజరవుతున్నానని చెప్పారు టీడీపీ అధినేత చంద్రబాబు

Read more RELATED
Recommended to you

Latest news