టీడీపికి నాలుగు,జేడీయూకి 2 మంత్రిత్వ శాఖలు…?

-

సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే గెలుపుతో మూడోసారి ప్రధానిగా నరేంద్రమోడీ రేపు ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. 2014, 2019లో మాదిరిగా బీజేపీ ఈ సారి మ్యాజిక్‌ఫిగర్(272)ని బీజేపీ స్వతహాగా సాధించలేక,240 సీట్లు మాత్రమే సాధించగలిగింది.దీంతో కూటమిలోని తెలుగుదేశం పార్టీ,జనతాదళ్ యునైటెడ్(జేడీయూ), శివసేన కీలకంగా మారాయి. మొత్తం 543 ఎంపీ సీట్లలో ఎన్డీయేకి ప్రస్తుతం 293 ఎంపీల మద్దతు ఉంది .

 

ఇదిలా ఉంటే.. మోడీ 3.0 సర్కార్‌లో మిత్రపక్షాలకు బెర్తులు ఖరారైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం.. చంద్రబాబు నాయుడు టీడీపికి 4 మంత్రిత్వ శాఖలు, నితీష్ కుమార్ జేడీయూకి 2 మంత్రిత్వ శాఖలు దక్కే అవకాశం దాదాపుగా ఖరారు అయినట్లు తెలుస్తోంది. ఇప్పటికే జేడీయూ నుంచి ఇద్దరు సీనియర్ నేతలైన రామ్‌నాథ్ ఠాకూర్ ,లాలన్ సింగ్ పేర్లను ప్రతిపాదించింది. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీకి 16, జేడీయూకి 12 సీట్లు ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news