బీజేపీతో తమ పార్టీ పొత్తు పెట్టుకోదు : ఎడప్పాడి పళనిస్వామి

-

తమిళనాడు ఎంపీ ఎన్నికల్లో రూలింగ్ పార్టీ డీఎంకే మరోసారి క్లీన్ స్వీప్ చేసింది. బీజేపీ ఎన్నో ఆశలు పెట్టుకున్నప్పటికీ ఒక్క ఎంపీ స్థానం కూడా సాధించలేకపోయింది. అయితే, బీజేపీ పార్టీ ఓట్ల శాతం మాత్రం పెరిగింది. మరోవైపు ప్రతిపక్ష అన్నాడీఎంకే(ఏఐడీఎంకే) కూడా ఆశించిన మేర రాలేకపోయింది. ఎన్డీయే కూటమిలో ఉన్న అన్నాడీఎంకే పలు కారణాల వల్ల బటయకు వెళ్లిపోవడంతో బీజేపీ, ఏఐడీఎంకేలు విడివిడిగా పోటీ చేసి నష్టపోయాయని వార్తలు వినిపిస్తున్నాయి.

ఇదిలా ఉంటే ఈ రెండు పార్టీల మధ్య పొత్తు చిగురిస్తుందా..? అంటే లేదనే సమాధానమే వినిపిస్తుంది. 2026లో జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో తమ పార్టీ పొత్తు పెట్టుకోదని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి తెలిపారు. ఈమేరకు సేలంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 2019తో పోలిస్తే ప్రస్తుతం తమ పార్టీకి 1 శాతం ఓట్లు పెరిగాయని తెలిపారు.” 2014లో ఎన్డీయే ఓట్ల శాతం 18.80 శాతంగా ఉంటే 2024లో ఎన్డీయే ఓట్ల శాతం 18.28 శాతం.

Read more RELATED
Recommended to you

Latest news