గుడివాడలో కొడాలి నాని వర్గీయులకు ఝలక్‌ !

-

కొడాలి నానికి ఊహించని ఝలక్ ఇస్తోంది తెలుగు దేశం పార్టీ. గుడివాడ నియోజక వర్గంలో మాజీ మంత్రి కొడాలి నానికి మరో షాక్ తగిలింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో గుడివాడ రాజేందర్ నగర్‌లో రూ.100కోట్ల స్థలాన్ని నాని అనుచరులు ఆక్రమించుకున్నారు. నాని అనుచరులు ఆక్రమించుకున్న 7.66ఎకరాల స్థలాన్ని యజమానులు తిరిగి స్వాధీనం చేసుకున్నారు.

ఆశలు వదిలేసుకున్న తరుణంలో టీడీపీ విజయం సాధించడంతో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అండగా నిలబడ్డారని బాధితులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక మొన్న టీడీపీ శ్రేణులు గుడివాడలోని ఆయన ఇంటి వద్ద హల్ చల్ చేశాయి. కొడాలి నాని ఇంటిపై కోడిగుడ్లు విసురుతూ ‘దమ్ముంటే బయటకి రా’ అంటూ సవాల్ విసిరారు. ఈ క్రమంలో పోలీసులు అడ్డుకుని టీడీపీ కార్యకర్తలను అక్కడి నుంచి పంపించారు. ‘పోలీసులు లేకపోతే నీది కుక్క బతుకు. బయటకు రా.. లోకేశ్ ఆధ్వర్యంలో నీకు అంకుశం సినిమా చూపిస్తాం’ అని వార్నింగ్ ఇచ్చారు .

Read more RELATED
Recommended to you

Latest news