కేంద్ర మంత్రిగా బీజేపీ ఎంపీ బండి సంజయ్ నిన్న కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో ప్రెసిడెంట్ ద్రౌపదీ ముర్ము ఆయనచే ప్రమాణం చేయించారు. బండి కేంద్ర మంత్రి కావడం ఇదే తొలిసారి.
ఇదిలా ఉంటే… తెలంగాణ ఎంపీ బండి సంజయ్కి హోంశాఖ సహాయమంత్రిగా అవకాశం దక్కింది. కరీంనగర్ నుంచి రెండోసారి ఎంపీగా గెలిచిన ఆయనకు తొలిసారి కేంద్ర కేబినెట్లో అవకాశం దక్కింది. గతంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసి, పార్టీ బలోపేతం కోసం బండి కృషి చేశారు.కాగా, కరీంనగర్ నుంచి బండి సంజయ్ విజయం సాధించిన విషయం తెలిసిందే. కరీంనగర్ కార్పొరేటర్ గా తన రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన బండి సంజయ్ ఆ తర్వాత ఎంపీగా గెలిచారు. అనంతరం తెలంగాణకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి పదవి బాధ్యతలు నిర్వహించారు. ఆ సమయంలో పార్టీని రాష్ట్రంలోనే బలోపేతంగా తయారు చేశారు. ఇక ఈ ఎన్నికల్లోనూ ఎంపీగా విజయం సాధించి ఇప్పుడు కేంద్ర మంత్రి పదవిని దక్కించుకున్నారు.