ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదాపై మాజీ ముఖ్యమంత్రి జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్డీఏలో తెలుగుదేశం పార్టీ కీలకంగా ఉందని, ఇప్పటికైనా ప్రత్యేక హోదా డిమాండ్ చేయాలన్నారు. ఇప్పుడు కూడా హోదా అడగకపోవడం చంద్రబాబు చేసిన మరో పాపమని చెప్పారు. ప్రత్యేక హోదా అడగకపోతే ఏపీ ప్రజలు క్షమించరని హెచ్చరించారు. ఎమ్మెల్సీలతో భేటీ అయిన ఆయన తమకున్న బలం ప్రకారం అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా ఇస్తారో లేదో అనేది అనుమానమేనని చెప్పారు.
అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయామని ఎవరూ నిరుత్సాహపడొద్దని, 2029లో మళ్లీ అధికారంలోకి వస్తామని సూచించారు. గతంలోనూ ఇలాంటి పరిస్థితులను వైసీపీ ఎదుర్కొందని తెలిపారు. 2019-24 మధ్య ఐదేళ్ల కాలం చూస్తుండగానే గడిచిపోయిందని, ఇప్పుడు 2024-29 అలాగే గడిచిపోతుందని తెలిపారు. అయితే కొంత సమయం పడుతుందని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మళ్లీ పుంజుకోవడం ఖాయమని వైసీపీ ఎమ్మెల్సీలకు సీఎం జగన్ సూచించారు.