మంచు విష్ణు ‘కన్నప్ప’ టీజర్ వచ్చేసింది

-

టాలీవుడ్ హీరో మంచు విష్ణు ప్రధాన పాత్రలో వస్తున్న తాజా చిత్రం ‘కన్నప్ప’. ఈ సినిమా విష్ణు డ్రీమ్ ప్రాజెక్టు.. ఈ సినిమా కోసం ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్నాడు. గత ఏడాది ఈ సినిమా షూటింగ్ ను మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు వచ్చిన అప్డేట్స్ సినిమా పై మంచి బజ్ ను క్రియేట్ చేస్తున్నాయి. తాజాగా ఈ సినిమా టీజర్ ను మూవీ మేకర్స్ రిలీజ్ చేశారు.

ఈ టీజర్ లో మంచు విష్ణు కత్తి పట్టుకొని నరుకుతున్నట్లు కనిపిస్తుంది.. అలాగే శివుడు తపస్సు చేస్తున్నట్లు తెలుస్తుంది.. అందులోని ప్రతి సీన్ గూస్ బంప్స్ తెప్పిస్తుంది.. అయితే శివుడి పాత్రలో ఎవరు నటిస్తున్నారన్నది క్లారిటీ రాలేదు కానీ అక్షయ్ కుమార్ ఉండవచ్చునని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి.. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట ట్రెండ్ అవుతుంది.. ఈ హిస్టారికల్ సోషియో ఫాంటసీ మూవీలో మధుబాల, నయనతార, మోహన్ లాల్, శివరాజ్ కుమార్, శరత్ కుమార్ వంటి ప్రముఖులు నటిస్తున్నారు.

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఈ సినిమాను భారీ బడ్జెట్ తో రూపోందిస్తున్నారు.. దాదాపు 150 కోట్ల బడ్జెట్ తో సినిమాను నిర్మిస్తున్నట్లు తెలుస్తుంది.. పాన్ ఇండియా స్థాయిలో భారీగా వస్తోన్న ఈ సినిమాను ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక కన్నప్ప సినిమా ప్రమోషన్స్ భారీగానే చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news