సరికొత్త రికార్డు సృష్టించిన ‘కుర్చీ మడతపెట్టి’ సాంగ్

-

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన తాజా చిత్రం గుంటూరు కారం. సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకి వచ్చింది.సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ చిత్రం యావరేజ్ టాక్ వచ్చినప్పటికీ కలెక్షన్లు మాత్రం భారీగానే రాబట్టింది.

ఇదిలా ఉంటే… ఈ సినిమాలోని ‘కుర్చీ మడతపెట్టి’ ఫుల్ వీడియో సాంగ్కు యూట్యూబ్లో 300M వ్యూస్ వచ్చాయి. దీంతో టాలీవుడ్లో అత్యంత వేగంగా (133 రోజుల్లో) 300M వ్యూస్ సాధించిన సాంగ్గా రికార్డు సృష్టించింది. దీని తర్వాత అరబిక్ కుతు (157 రోజులు), బుట్ట బొమ్మ (158 రోజులు), ఊ అంటవా (265 రోజులు) సాంగ్స్ ఉన్నాయి.

కాగా, ఈ చిత్రంలో శ్రీలీల, మీనాక్షి చౌదరి కథానాయికలుగా నటించగా, రమ్యకృష్ణ, జయరాం,మురళి శర్మ, ప్రకాష్ రాజ్, ఈశ్వరరావు,వెన్నెల కిషోర్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ ఎస్ తమన్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించాడు. హారిక అండ్ హసన్ క్రియేషన్స్ పతాకంపై చిన్నబాబు ఈ చిత్రాన్ని నిర్మించాడు.

Read more RELATED
Recommended to you

Latest news