ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఫైర్..!

-

కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఫైర్ అయ్యారు. జగిత్యాల పట్టణంలో 4వ వార్డులో బీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ లైబ్రరీ డైరెక్టర్ సుధాకర్ ఇళ్లు కట్టుకుంటే జీవన్ రెడ్డి కలెక్టర్ కి ఫిర్యాదు చేయడం తగదన్నారు. ఒక మధ్య తరగతి వ్యక్తి ఇళ్లు కట్టుకుంటే సక్రమంగా నిర్మాణం లేదంటూ ఫిర్యాదు ఇవ్వడం బాధాకరమన్నారు. అన్ని అనుమతులు తీసుకునే ఇళ్లు కట్టుకుంటున్నారని.. వ్యక్తి గత కక్ష సాధింపు  చేయడం బాధాకరమన్నారు. 40 ఏళ్ల రాజకీయ జీవితమని చెబుతున్న జీవన్ రెడ్డి జగిత్యాల పట్టణాన్ని అస్తవ్యస్తంగా తయారు చేశారని
మండిపడ్డారు.

మాస్టర్ ప్లాన్ కి వ్యతిరేకంగా నిర్మాణాలు చేస్తుంటే జీవన్ రెడ్డి ఎందుకు ప్రేక్షక పాత్ర వహించారని అన్నారు. వేల ఇండ్లు పర్మిషన్లు లేకుండా జీవన్ రెడ్డి హయాంలో అయ్యాయని ఆయన విమర్శించారు. జగిత్యాలలో లెక్క లేనన్ని అక్రమ నిర్మాణాలు జరిగాయని ఆరోపించారు. జీవన్ రెడ్డికి నచ్చితే అది సక్రమం.. నచ్చకపోతే అక్రమమేనా అంటూ విమర్శించారు. మీకు దండం పెట్టి, మీ తమ్ముడికి తులసి, పత్రి ఇస్తే అక్రమం కూడా సక్రమమేనా అంటూ ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Latest news